బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండంగా మారి, 16 నాటికి తుపానుగా బలపడనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. 18 నాటికి తీవ్ర తుపానుగా మారే అవకాశముంది. దీంతో 18, 19 తేదీల్లో శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ప్రమాదముందని ఎల్లో అలర్ట్ జారీ చేశారు.