ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇది వాయుగుండంగా, ఆపై తుపానుగా మారే అవకాశముంది. వచ్చే వారంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు, గంటకు 65 కిమీ వేగంతో గాలులు వీయవచ్చు. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని, వెళ్లిఉంటే తిరిగిరావాలని అధికారులు హెచ్చరించారు.
ఏపీ వైపు వాయుగుండం: భారీ వర్షాలు, ఈదురుగాలుల హెచ్చరిక




