ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది ఆదివారానికి వాయుగుండంగా, సోమవారానికి తుపానుగా మారొచ్చని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. దీంతో ఆంధ్రప్రదేశ్, ఉత్తర తమిళనాడు తీర ప్రాంత ప్రజలు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
బంగాళాఖాతంలో అల్పపీడనం.. తుపానుగా మారే అవకాశం




