తెలంగాణలోని విశ్వవిద్యాలయాల్లో 526 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి డిసెంబర్ 1న నోటిఫికేషన్ రానున్నట్లు సమాచారం. వీటిలో 429 రెగ్యులర్, 97 బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయి. డిసెంబర్ 2 నుండి 22 వరకు ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరించనున్నారు. డెమో క్లాస్, ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక పూర్తి చేసి 2027 ఏప్రిల్ నాటికి నియామక పత్రాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
తెలంగాణ వర్సిటీల్లో 526 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ




