అమెరికాలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కేంద్రాల్లో కమ్యూనికేషన్ లోపం వల్ల విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. భద్రత దృష్ట్యా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ గ్రౌండ్ స్టాప్ విధించింది. దీంతో 11 వేలకు పైగా విమానాలు ఆలస్యమవ్వడం లేదా రద్దవ్వడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.