చైనాలో అన్ని రకాల సరోగసీ పద్ధతులను పూర్తిగా నిషేధించినట్లు నేషనల్ హెల్త్ కమిషన్ ప్రతినిధి యాంగ్ జిన్‌రూయ్ తెలిపారు. సరోగసీ ఒప్పందాలకు చట్టపరమైన రక్షణ ఉండదని చెప్పారు. అక్రమ పునరుత్పత్తి కేంద్రాలపై దర్యాప్తు జరిపి హునాన్ ప్రావిన్స్‌లోని చాంగ్షాలో 21 మందిని అరెస్టు చేసి, మందులను స్వాధీనం చేసుకున్నారు.