అమెరికాలో విమానాల నిలిపివేతకు సైబర్ దాడి కారణం కాదని రవాణా శాఖ మంత్రి సీన్ డఫీ స్పష్టం చేశారు. పాత టెలికమ్యూనికేషన్ వ్యవస్థపై డేటా భారం పెరిగి సాంకేతిక లోపం తలెత్తిందని చెప్పారు. ప్రయాణికుల భద్రత కోసమే దేశవ్యాప్తంగా విమానాల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు తెలిపారు.