హైదరాబాద్‌లోని సింగూరు, మంజీరా జలాశయాల్లో నిల్వలు 42 రోజులకు మాత్రమే సరిపోతాయని అధికారులు తెలిపారు. డిసెంబర్ తర్వాత శేరిలింగంపల్లి, పటాన్‌చెరు, జూబ్లీహిల్స్, కూకట్‌పల్లి, సనత్‌నగర్, రాజేంద్రనగర్, ఖైరతాబాద్‌లలో నీటి ఎద్దడి రావచ్చు. దీంతో ఈ ప్రాంతాలకు గోదావరి జలాలు మళ్లించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.