ఉస్మానియా యూనివర్సిటీ హాస్టళ్లలో తాగునీరు, విద్యుత్ సమస్యలపై విద్యార్థులు శుక్రవారం ఆందోళన చేపట్టారు. నిరసన తెలిపిన విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేసి నల్లకుంట పోలీస్ స్టేషన్కు తరలించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్ నినోను కారణం చూపుతూ విద్యుత్ కోతలు విధిస్తోందని, సమస్యలను వెంటనే పరిష్కరించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు.
ఉస్మానియా వర్సిటీలో విద్యార్థుల ఆందోళన.. పలువురి అరెస్ట్
Hyderabad




