దీపావళి వేళ తెలంగాణలోని 4.5 లక్షల మందికి కొత్తగా చేయూత పింఛన్లు అందించనున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు. కొడంగల్‌లో ఆదివారం జరిగే కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ పంపిణీని ప్రారంభిస్తారని పేర్కొన్నారు. కొత్త లబ్ధిదారులకు ఈ నెల నుంచే చెల్లింపులు ప్రారంభమవుతాయని వెల్లడించారు.
తెలంగాణలో కొత్తగా 4.5 లక్షల మందికి ‘చేయూత’ పింఛన్లు: మంత్రి సీతక్క




