తెలంగాణ ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి పథకం కింద 95 లక్షల మంది మహిళలకు ఉచిత చీరలు పంపిణీ చేయనుంది. ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా నవంబర్ 19న హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులో సీఎం రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. తెల్ల రేషన్ కార్డు కలిగిన మహిళలకు ఇవి అందుతాయి.
తెలంగాణలో ఉచిత చీరల పంపిణీకి ప్రభుత్వం నిర్ణయం




