దీపావళి పండుగ వేళ బాణసంచా కాల్చేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. గుర్తింపు పొందిన దుకాణాల్లోనే నాణ్యమైన క్రాకర్స్ కొనుగోలు చేయాలి. పిల్లలు టపాసులు కాల్చే సమయంలో తల్లిదండ్రుల పర్యవేక్షణ తప్పనిసరిగా ఉండాలి. చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉందని 10టీవీ ప్రత్యేక కథనం ద్వారా తెలిపింది.
దీపావళికి బాణసంచా కాల్చేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి




