తెలంగాణలో గ్రామ పంచాయతీలు తమ సొంత నిధులను ప్రభుత్వ ఖజానాకు మళ్లించకుండా, నేరుగా తమ బ్యాంక్ ఖాతాల్లోనే జమ చేసుకునేలా ప్రభుత్వం చట్ట సవరణ చేసింది. పంచాయతీ రాజ్ శాఖ ఈ మేరకు జీవో 43ను జారీ చేసింది. దీని ద్వారా తాగునీరు, పారిశుధ్య పనుల జాప్యానికి చెక్ పడనుంది.