చలికాలంలో గీజర్ల వినియోగం పెరుగుతోంది. సాధారణ స్టోరేజ్ గీజర్లకు భిన్నంగా ట్యాంక్‌లెస్ గీజర్లు నీటిని నిల్వ చేయకుండానే వెంటనే వేడినీళ్లను అందిస్తాయి. ఇందులో కుళాయి ఆన్ చేయగానే చల్లటి నీరు పైపుల ద్వారా వెళ్లి, సెన్సార్లు మరియు హీటింగ్ ఎలిమెంట్ సహాయంతో వేగంగా వేడెక్కుతుంది. దీనివల్ల విద్యుత్ ఆదా అవుతుంది.