ఆధార్ ధృవీకరణ కోసం ఇకపై జిరాక్స్ కాపీలు ఇవ్వాల్సిన అవసరం లేదని యూఐడీఏఐ తెలిపింది. డిజిటల్ విధానంలో యాప్ ద్వారా ఆఫ్‌లైన్ వెరిఫికేషన్ చేసే కొత్త సదుపాయాన్ని వచ్చే ఏడాది నుండి తెస్తోంది. హోటళ్లు, ఆస్పత్రులు, విద్యాసంస్థలు, స్విగ్గీ, జొమాటో వంటి 300 సంస్థలు ఇందులో నమోదయ్యాయి.
ఆధార్ కార్డుదారులకు ఊరట: ఇకపై జిరాక్స్ కాపీలు అవసరం లేదు




