తమ అనుమతి లేకుండా వ్యక్తిగత కంటెంట్‌ను సోషల్ మీడియాలో నిరంతరం షేర్ చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని నటి సురేఖా వాణి హెచ్చరించారు. తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా హ్యాక్‌కు గురైందని, లీకైన తన ప్రైవేట్ మెటీరియల్‌ను ఎవరైనా సర్క్యులేట్ చేస్తే ఊరుకోనని ఆమె స్పష్టం చేశారు.