ఆంధ్రప్రదేశ్ జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల లెక్కింపులో వైఎస్ జగన్ సొంత నియోజకవర్గం పులివెందుల జడ్పీటీసీ స్థానాన్ని టీడీపీ దక్కించుకుంది. టీడీపీ అభ్యర్థి బి. భారతి 1,463 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. పులివెందుల నియోజకవర్గంలో మొత్తం ఏడు జడ్పీటీసీ స్థానాలు ఉండగా, అందులో మూడు ఏకగ్రీవమయ్యాయి.