మల్కాజీగిరి కమిషనరేట్ పరిధిలోని కీసర ఎస్సై కొండారెడ్డి శ్రీనివాస్ రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు. కేసులో చార్జ్‌షీట్ దాఖలు చేసేందుకు ఆయన ఈ డబ్బు డిమాండ్ చేశారు. బాధితుడి ఫిర్యాదుతో దాడులు చేసిన ఏసీబీ, ఎస్సైపై కేసు నమోదు చేసి నాంపల్లి కోర్టులో హాజరుపరిచింది.