హైదరాబాద్ మీర్‌పేట పరిధిలోని జిల్లెలగూడ దత్తునగర్‌లో అనిత అనే మహిళ హత్యకు గురైంది. శ్రీలక్ష్మీ రెసిడెన్సీలోని తమ ఇంట్లో ఆమె రక్తపు మడుగులో పడి ఉండగా, స్కూల్ నుండి వచ్చిన పిల్లలు చూసి తండ్రి అరుణ్ కుమార్‌కు సమాచారం ఇచ్చారు. ఆసుపత్రికి తరలించగా ఆమె మరణించినట్లు వైద్యులు చెప్పారు.