వాహనాల్లో ట్యూబ్, ట్యూబ్‌లెస్ టైర్లను ఉపయోగిస్తారు. ట్యూబ్ టైర్లలో గాలి నిల్వకు ప్రత్యేక రబ్బరు గొట్టం ఉంటుంది. ట్యూబ్‌లెస్ టైర్లలో ఈ గొట్టం ఉండదు, టైరు లోపలి పొరే గాలిని పట్టి ఉంచుతుంది. చక్రాల డిజైన్, రిమ్ రకం ఆధారంగా కంపెనీలు వీటిని అమరుస్తాయి.