దీపావళి వేళ చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయానికి భక్తుల రద్దీ దృష్ట్యా ట్రాఫిక్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం నుంచి ఈ నెల 11వ తేదీ వరకు చార్మినార్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మదీనా, ముర్గీ చౌక్, షాలిబండ నుంచి చార్మినార్ వైపు వచ్చే వాహనాల రాకపోకలను నియంత్రించి, దారి మళ్లిస్తున్నారు.