హైదరాబాద్ బాలానగర్ వద్ద లారీ ఢీకొన్న ప్రమాదంలో 13 ఏళ్ల గుడ రోహిత తీవ్రంగా గాయపడి బ్రెయిన్ డెడ్ అయింది. తీవ్ర దుఃఖంలోనూ ఆమె తండ్రి నారాయణ రావు అవయవదానానికి ముందుకొచ్చారు. జీవన్‌దాన్ ద్వారా రోహిత కిడ్నీలు, కాలేయం, కార్నియాలు దానం చేయడంతో ఆరుగురికి పునర్జన్మ లభించింది.