దీపావళి పండుగ వేళ ప్రముఖ డెయిరీ సంస్థ అమూల్ వెన్న, నెయ్యి ధరలను పెంచింది. లీటర్ నెయ్యి కార్టన్ ధర రూ.50 పెరిగి రూ.680కి చేరింది. 500 గ్రాముల వెన్న ప్యాకెట్ ధర రూ.15 పెరిగి రూ.325కి చేరినట్లు సంస్థ తెలిపింది. ఈ కొత్త ధరలు తక్షణమే అమల్లోకి వచ్చాయి.