హైదరాబాద్ మెట్రో, ఆర్టీసీ బస్సుల కామన్ పాస్ ధరలను ప్రభుత్వం తగ్గించింది. రోజువారీ పాస్ ధరను రూ.400 నుంచి రూ.275కు, నెలవారీ పాస్‌ను రూ.8,500 నుంచి రూ.4,000కు తగ్గించినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. నవంబర్ 8 నుంచి ఈ కొత్త ధరలు అమల్లోకి వస్తాయి.