హైదరాబాద్‌లో మెట్రో, ఆర్టీసీ బస్సుల ఉమ్మడి నెలవారీ పాస్ ధరను ప్రభుత్వం రూ.8,500 నుంచి రూ.4 వేలకు తగ్గించింది. గతంలో పెట్టిన ధరపై స్పందన లేకపోవడంతో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి ఆదేశాలతో ధర తగ్గించినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. నవంబర్ 8 దీపావళి నుంచి ఇవి అమలవుతాయి.