ఉద్యోగం, కుటుంబ బాధ్యతలు, పిల్లలు, నెలవారీ ఖర్చుల పరుగులోనే చాలామంది జీవితం గడిచిపోతోంది. అందరి అవసరాల కోసం కష్టపడుతూ తమ ఇష్టాలు, చదవాల్సిన పుస్తకాలు, కొత్త విషయాలు నేర్చుకోవడం, స్నేహితులతో సమయం గడపడం వంటివి పూర్తిగా మర్చిపోతున్నారు. ఈ క్రమంలో వ్యక్తిగత జీవితం కోసం ఎప్పుడు జీవిస్తామనే ప్రశ్న ఎదురవుతోంది.