తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ కేసు విచారణను ఆంధ్రప్రదేశ్ వెలుపలకు మార్చాలని దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు గురువారం కొట్టివేసింది. మహారాష్ట్రకు చెందిన మల్గంగ మిల్క్ అండ్ ఆగ్రో ప్రొడక్ట్స్ ఎండీ మాచింద్ర శంతారామ్ లాంకే దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను పరిశీలించడానికి సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం నిరాకరించింది.