దీపావళి బాణసంచా పొగ వల్ల అకస్మాత్తుగా శ్వాస సమస్యలు వచ్చే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పొగలోని రసాయనాల వల్ల శ్వాసనాళాల్లో వాపు వచ్చి దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతాయి. ముఖ్యంగా ఆస్తమా ఉన్నవారు, చిన్నపిల్లల పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.