హైదరాబాద్‌లోని ఓ కళాశాల లెక్చరర్, ప్రిన్సిపాల్ తన ఫోన్ లాక్కుని వేధించడంతో మానసిక వేదనకు గురై హోటల్ మేనేజ్‌మెంట్ విద్యార్థి భాను ప్రసాద్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు. లెక్చరర్ ఫోటోను మార్ఫింగ్ చేశాడనే కారణంతో తల్లిదండ్రులను పిలిస్తేనే ఫోన్ ఇస్తామని చెప్పడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడని ఎస్‌ఆర్‌నగర్ పోలీసులు తెలిపారు.