హైదరాబాద్‌లోని అమీర్‌పేట్ ఎస్‌ఆర్ నగర్ పరిధిలో ఉన్న అమృత హోటల్ మేనేజ్‌మెంట్ కాలేజీ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రిన్సిపాల్ వేధింపుల వల్లే ఈ ఘటన జరిగిందని ఆరోపిస్తూ తోటి విద్యార్థులు ఆందోళనకు దిగారు. కాలేజీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేయగా, పోలీసులు వచ్చి సర్దిచెప్పారు.