హైదరాబాద్ గచ్చిబౌలిలోని మారియట్ ఎగ్జిక్యూటివ్ అపార్ట్‌మెంట్స్‌లో అమెరికాకు చెందిన 41 ఏళ్ల మిచెల్ బ్రియాన్ లీ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. వ్యాపార పనులపై వచ్చిన ఆయన హోటల్ గదిలోని మంచంపై విగతజీవిగా కనిపించారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.