తెలంగాణలో గిగ్ వర్కర్ల చట్టం అమల్లోకి వచ్చింది. ప్రభుత్వం రూపొందించిన విధివిధానాలను రాహుల్ గాంధీ శనివారం ప్రారంభించారు. స్విగ్గీ, జొమాటో, ఓలా, ఉబర్ వంటి సంస్థల్లో పనిచేసే సుమారు 6 లక్షల మంది అసంఘటిత రంగ కార్మికులకు బీమా, సామాజిక భద్రత కల్పించేందుకు ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయనున్నారు.