తెలంగాణలో ఎంపీపీ, జెడ్పీపీ అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవుల పరోక్ష ఎన్నికల షెడ్యూల్‌ను ఎస్‌ఈసీ విడుదల చేసింది. నవంబర్ 19న ఎంపీపీ, నవంబర్ 20న జెడ్పీపీ ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 14లోగా సభ్యులకు నోటీసులు ఇవ్వాలని ఆదేశించారు. మైనారిటీల కోసం ప్రతి ఎంపీపీలో ఒకరిని, జెడ్పీపీలో ఇద్దరిని కోఆప్టెడ్ సభ్యులుగా ఎన్నుకుంటారు.