తెలంగాణ కాంగ్రెస్ కొత్త ఇన్‌ఛార్జిగా బీఎం సందీప్‌ను అఖిల భారత కాంగ్రెస్ కమిటీ నియమించింది. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లిన మీనాక్షి నటరాజన్ స్థానంలో ఆయన బాధ్యతలు చేపడతారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆమోదంతో ఈ నియామకం వెంటనే అమల్లోకి వచ్చిందని కేసీ వేణుగోపాల్ తెలిపారు.