కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ శుక్రవారం రాత్రి ఢిల్లీ నుంచి హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయానికి రానున్నారు. శనివారం ఉదయం కాంగ్రెస్ ముఖ్య నేతలతో భేటీ అవుతారు. అనంతరం గిగ్ వర్కర్ల ర్యాలీలో పాల్గొని, హెచ్‌ఐసీసీలో జరిగే భారత్ సమ్మిట్ ముగింపు వేడుకల్లో కీలక ప్రసంగం చేస్తారు.