ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు ఎస్ఈసీ నిర్ణయించింది. ఈ నెల 15వ తేదీ నుంచి నామినేషన్లను స్వీకరించనున్నారు. పల్నాడు, రాయలసీమతో పాటు పులివెందుల లాంటి ప్రాంతాల్లో వైసీపీ మద్దతుదారులు స్వేచ్ఛగా నామినేషన్లు వేయగలరా లేదా అని పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.