విదేశాల్లో ఉండే తెలుగువారికి ఏపీ రాజకీయాపై ఎంతో ఆసక్తి ఉంటుంది. ఇప్పటికే టీడీపీ ఎన్ఆర్ఐ విభాగం చాలా బలంగా ఉంది. దీంతో వైసీపీ కూడా తమ ఎన్ఆర్ఐ వింగ్ గ్లోబల్ కోఆర్డినేటర్ ఆలూరు సాంబశివారెడ్డి ఆధ్వర్యంలో విదేశాల్లోని పార్టీ అభిమానులను ఒకే తాటిపైకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది.