పల్నాడు జిల్లా నరసరావుపేట మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల వేళ వైసీపీ మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని పోలీసులు గృహనిర్బంధం చేశారు. అభ్యర్థులతో కలిసి నామినేషన్ వేయడానికి ఆయన సిద్ధమవ్వగా, పోలీసులు అడ్డుకున్నారు. టీడీపీ దౌర్జన్యాలు చేస్తోందని వైసీపీ ఆరోపించింది.