తెలంగాణలో ధరణి ల్యాండ్ పోర్టల్లో అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై సీఐడీ అధికారులు పెద్ద ఎత్తున తనిఖీలు చేపట్టారు. 15 ప్రత్యేక బృందాలు రంగార్రెడ్డి, వికారాబాద్, హైదరాబాద్, యాదాద్రి, జనగామ, సిద్దిపేట, మేడ్చల్ జిల్లాల్లో దాడులు చేశాయి. పోర్టల్ డెవలపర్లు, ఆపరేటర్లు, డాక్యుమెంట్ రైటర్ల ఇళ్లలో ఈ సోదాలు నిర్వహించారు.
ధరణి పోర్టల్ అక్రమాలపై తెలంగాణ సీఐడీ సోదాలు




