రంగారెడ్డి జిల్లా మంచాల, ఇబ్రహీంపట్నం మండలాల్లోని రైస్ మిల్లులపై అధికారులు దాడులు చేశారు. పేదల రేషన్ బియ్యాన్ని పాలిష్ చేసి, సోనా మసూరిగా 28 బ్రాండ్ల పేర్లతో విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఎస్పీ రాంకుమార్ నేతృత్వంలోని బృందాలు 200 క్వింటాళ్లకు పైగా పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నాయి. అనుమతుల్లేని మిల్లును గుర్తించారు.