హైదరాబాద్‌కు చెందిన ఎన్‌బీఎఫ్‌సీ సంస్థ కీర్తనా ఫిన్‌సర్వ్‌ లిమిటెడ్‌పై సైబర్‌ నేరగాళ్లు దాడి చేసి రూ.7.09 కోట్లకుపైగా కొల్లగొట్టారు. శుక్రవారం గంట వ్యవధిలో 39 అనధికారిక లావాదేవీల ద్వారా ఈ సొమ్మును వేర్వేరు ఖాతాలకు మళ్లించారు. డైరెక్టర్‌ చాగంటి వరప్రసాద్‌ ఫిర్యాదుతో తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో కేసు నమోదు చేసింది.