స్వచ్ఛ సర్వేక్షణ్‌లో జీహెచ్‌ఎంసీ జాతీయ అవార్డు సాధించింది. న్యూఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా మంత్రి పొన్నం ప్రభాకర్, అధికారులు సర్ఫరాజ్ అహ్మద్, ఆర్వీ కర్ణన్ ఈ పురస్కారాన్ని అందుకున్నారు. చెత్త సేకరణ, పారిశుధ్యం తదితర అంశాల ఆధారంగా కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ జీహెచ్‌ఎంసీకి ఈ అవార్డును అందించింది.