హైదరాబాద్లో మెట్రో, ఆర్టీసీ ఉమ్మడి నెలవారీ పాస్ ధరను రూ.8,500 నుంచి రూ.4,000కు తగ్గిస్తున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. రోజువారీ పాస్ రూ.275కు లభిస్తుంది. నెలవారీ పాస్తో 50 రౌండ్ ట్రిప్పులు, రోజువారీ పాస్తో నాలుగు జర్నీలకు అనుమతి ఉంటుంది. నవంబర్ 8 నుంచి ఈ మార్పులు అమల్లోకి రానున్నాయి.
మెట్రో, ఆర్టీసీ ఉమ్మడి పాస్ ధరలు భారీగా తగ్గింపు




