హైదరాబాద్‌లో ప్రజా రవాణాను ప్రోత్సహించేందుకు మెట్రో, ఆర్టీసీ కామన్ పాస్ ధరలను తగ్గించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. దీని ప్రకారం ప్రస్తుతం రూ.8,500గా ఉన్న నెలవారీ పాస్ ధర రూ.4,500కి, రోజువారీ పాస్ ధర రూ.400 నుంచి రూ.325కు తగ్గనుంది. ఈ నిర్ణయంతో ప్రయాణికులకు ఖర్చులు భారీగా ఆదా కానున్నాయి.