తూర్పు తెలంగాణ, కోస్తాంధ్ర ప్రాంతాల్లో అల్పపీడనం బలహీనపడినా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మరో 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కోస్తాంధ్ర, యానాంలో మోస్తరు నుంచి భారీ వర్షాలతో పాటు గంటకు 50 కిమీ వేగంతో ఈదురుగాలులు వీచవచ్చని పేర్కొంది.