బాలాపూర్ పరిధిలోని సర్వే నంబర్ 273లో ఉన్న 3 ఎకరాల 'కొంతమోని కుంట' ఆక్రమణకు గురవుతోంది. హస్తం నేతల బెదిరింపులతో అధికారులు చర్యలు తీసుకోవడం లేదని ఆరోపణలు ఉన్నాయి. నోటీసులకే పరిమితమైన నీటిపారుదల శాఖ, హైడ్రా యంత్రాంగం అక్రమ వెంచర్లపై పట్టించుకోవడం లేదని స్థానికులు పేర్కొన్నారు.