నంద్యాల జిల్లా నందికొట్కూరు, బేతంచెర్ల మున్సిపాలిటీలను వైసీపీ గెలుచుకోవడంతో టీడీపీ అప్రమత్తమైంది. పరిషత్ ఎన్నికల్లో వైసీపీ నేతలు, ఏజెంట్లను పోలీసులు అడ్డుకున్నారని ఆరోపణలు వచ్చాయి. నందికొట్కూరులో వైసీపీ యువనేత బైరెడ్డి సిద్ధార్థ్‌రెడ్డి ప్రచారాన్ని కట్టడి చేశారని వార్తలు వచ్చాయి.

