ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా 70.02 శాతం పోలింగ్ నమోదైనట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. జిల్లాల వారీగా విశాఖపట్నంలో అత్యధికంగా 82.51 శాతం, అల్లూరి జిల్లాలో అత్యల్పంగా 62.01 శాతం ఓటింగ్ నమోదైంది. గురువారం ఉదయం 7 నుండి సాయంత్రం 5 గంటల వరకు ఈ పోలింగ్ జరిగింది.