తెలంగాణలోని ఆరు ప్రాంతాల్లో 12 ఆటోమేటెడ్ డ్రైవింగ్ లైసెన్స్ టెస్ట్ ట్రాక్‌లను ఏర్పాటు చేసేందుకు మారుతి సుజుకీ సంస్థ రవాణా శాఖతో ఒప్పందం కుదుర్చుకుంది. రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం, కొండాపూర్, మేడ్చల్ జిల్లాలోని ఉప్పల్, మేడ్చల్, నాగోల్, అలాగే కరీంనగర్‌లో వీటిని నెలకొల్పనున్నారు. ఈ ట్రాక్‌లలో హెచ్‌డీ కెమెరాలు, ఆర్‌ఎఫ్‌ఐడీ సెన్సార్లు, సమీకృత ఐటీ వ్యవస్థ ఉంటాయి.