పండుగ వేళ బంగారం ధరలు భారీగా పెరిగాయి. హైదరాబాద్, విజయవాడ, విశాఖలలో 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.1,46,030 కాగా, 22 క్యారెట్ల రేటు రూ.1,33,860గా ఉంది. ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,46,180కి చేరింది. దీపావళి నాటికి ధరలు మరింత పెరగొచ్చని నిపుణులు చెబుతున్నారు.